ఐటీ కారిడార్​లో హెరాయిన్ ...ముగ్గురు యువకుల అరెస్ట్

ఐటీ కారిడార్​లో హెరాయిన్ ...ముగ్గురు యువకుల అరెస్ట్
  • రూ.3.50 లక్షల సరుకు సీజ్

గచ్చిబౌలి, వెలుగు: వెస్ట్​ బెంగాల్ నుంచి హైదరాబాద్​కు హెరాయిన్ తీసుకొచ్చి అమ్ముతున్న ముగ్గురు యువకులను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్​టాస్క్​ఫోర్స్ ​పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.3.50 లక్షల విలువైన 70 గ్రాముల సరుకును స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్​బెంగాల్​లోని మాల్దా జిల్లాకు చెందిన అజ్మల్ ​హుస్సేన్​(32), నూర్ ఆజంఖాన్​(24) హఫీజ్​పేట్​లో తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. వీరి ప్రాంతానికే చెందిన సురోజ్​(24) నానక్​రాంగూడ లేబర్​కాలనీలో ఉంటూ స్థానికంగా కూలీ పనులు చేస్తున్నాడు.

అజ్మల్, ఆజంఖాన్ తమ సొంతూరులో ఇటీవల ఓ వ్యక్తి వద్ద 70 గ్రాముల హెరాయిన్​ను గ్రాముకు రూ.వెయ్యి చొప్పున కొనుగోలు చేశారు. అనంతరం దీనిని సురోజ్​కు గ్రాముకు రూ.5 వేల చొప్పున అమ్మేందుకు ఈ నెల 4న సిటీకి వచ్చారు. పక్కా సమాచారంతో వీరి ముగ్గురిని బుధవారం సాయంత్రం నానక్​రాంగూడ అపోలో హాస్పిటల్​సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. సురోజ్ నానక్​రాంగూడతో పాటు ఐటీ కారిడార్​లోని ఐటీ ఉద్యోగులకు ఎక్కువ ధరకు హెరాయిన్ అమ్మి సొమ్ము చేసుకునేందుకు ప్లాన్​చేసినట్లు పోలీసులు తెలిపారు.

4 కిలోల గంజాయి సీజ్

హైదరాబాద్ సిటీ: సరూర్​నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఎస్టీఎఫ్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేర్వేరుగా తనిఖీలు చేసి, 4.36  కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. సరూర్​నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధి మల్లాపూర్​లో గంజాయి అమ్ముతున్న ఒడిశాకు చెందిన కూన సేవ్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి1.53 కేజీల గంజాయి,  రెండు సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు కోణార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్​లో ఒడిశాకు వెళ్లి, సిటీకి గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. మరో కేసులో శేరిలింగంపల్లి పరిధి మియాపూర్​లోని ఓ ఇంట్లో గంజాయి నిల్వ చేశారన్న సమాచారంతో దాడి చేశారు. అస్సాంకు చెందిన భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూయ్యా ఇంట్లో1.230 గ్రాముల సరకుతోపాటు గంజాయి మొక్కలను గుర్తించారు. నిందితుడిని శేరిలింగంపల్లి ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు అప్పగించారు. అలాగే మల్కాజిగిరి పరిధి నేరెడ్​మెట్​లోని వినాయకనగర్​లో వహిమా బేగం వద్ద 1.60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు గంజాయి సరఫరా చేస్తున్న షాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరారీలో ఉన్నాడు.