నకిలీ విత్తనాలపై జాయింట్​ఆపరేషన్​


ఖమ్మం రూరల్ వెలుగు: నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్​అధికారులు, వ్యవసాయాధికారులు కలిసి జాయింట్​ఆపరేషన్​ నిర్వహించారు. విత్తన డీలర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు.  రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే  పీడీయాక్ట్ నమోదు చేస్తామని  విత్తన డీలర్లను  రూరల్ ఏసీపీ బస్వారెడ్డి  హెచ్చరించారు. మంగళవారం బైపార్​ రోడ్డులోని టీసీవీ రెడ్డి ఫంక్షన్​ హాల్ లో పోలీస్, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో డీలర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఎరువులు, విత్తనాల విక్రయాలకు  రశీదు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ అనుమతి ఉన్న మేలు రకం విత్తనాలను మాత్రమే  విక్రయించాలన్నారు. ఎవరైనా నకిలీ, విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం తెలిస్తే నిర్భయంగా పోలీసులకు ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు.  కార్యక్రమంలో సీఐలు రాజిరెడ్డి, కంది జితేందర్ రెడ్డి, కూసుమంచి వ్యవసాయ సంచాలకులు విజయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

వైరా మండలంలో..

వైరా, :  రైతులకు నకిలీ విత్తనాలు అమ్మే డీలర్లపై  చర్యలు తీసుకుంటామని   వైరా  వ్యవసాయ శాఖ ఏడి బాబురావు సీఐ సురేశ్​అన్నారు.  వైరా  కె.వి.కె రైతు వేదికలో  నకిలీ విత్తనాలు సరఫరాపై   పోలీస్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో   ఏడీ బాబురావు, కేవీకే కోఆర్డినేటర్ హేమంతరావు,  సీఐ సురేశ్​  మాట్లాడారు. నిరంతరం వ్యవసాయ శాఖ,  పోలీసులు,   అధికారులు,  టాస్క్ ఫోర్స్ సిబ్బంది  విత్తన దుకాణాలను  పర్యవేక్షణ చేస్తారన్నారు. కార్యక్రమంలో  ఏఓలు పవన్​కుమార్​. బాలాజీ, కొణిజర్ల ఎసై శంకరావు, విత్తన డీలర్లు  పాల్గొన్నారు.

పాల్వంచ మండలంలో

పాల్వంచ రూరల్  పాల్వంచ మండల పరిధిలోని రాజాపురం, మొండికట్ట గ్రామాల్లో ఉన్న ఫర్టిలైజర్​ దుకాణాలను మండల వ్యవసాయశాఖ అధికారి శంకర్​, రూరల్​ ఎస్​ఐ శ్రీనివాస్​ తనిఖీచేశారు. ఈసందర్భంగా  వారు ఎరువుల దుకాణంలో వున్న బిల్​ బుక్స్​, స్టాక్​ నిల్వలు, వే బిల్లుల అగ్రిమెంటులు, షాపుకు సంబంధించిన లైసెన్స్​ పత్రాలను  పరిశీలించారు. 

కామేపల్లి మండలంలో      

కామేపల్లి:    అపరిచిత వ్యక్తుల వద్ద విత్తనాలను కొనుగోలు చేయొద్దని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్  విజయనిర్మల రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని ముచ్చర్ల రైతు వేదికలో రైతులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు .  అనంతరం నర్సరీలలో పెంచుతున్న టేకు మొక్కలను పరిశీలించారు. కార్యక్మంలో ముచ్చర్ల సర్పంచ్ జాటోత్ జాయ్ లూసీ,  ఏ డి ఏ సరిత, ఏవో తారా దేవి, ఏ ఈ ఓ లు ఉష, మున్ని తదితరులు పాల్గొన్నారు.  

 అశ్వాపురం మండలంలో ..

అశ్వాపురం వెలుగు : మణుగూరు డీఎస్పీ ఆదేశాల మేరకు అశ్వాపురం మండలంలో మంగళవారం పోలీస్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఎరువుల షాపులు, పురుగుమందుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.  స్టాక్ వివరాలు సేకరించారు . రికార్డులను కొనుగోలు బిల్లులను పరిశీలించారు. నకిలీ విత్తనాలు కొనుగోలు అమ్మకాలు చేయరాదని యజమానులకు సూచించారు. రైతులను మోసగిస్తే చట్టపరమైన కేసులు పెడతామని అన్నారు. కార్యక్రమంలో సీఐ  శ్రీనివాసరావు ఎస్సై సురేశ్​, ఏవో సాయి శంతన్ కుమార్, ఆర్ ఐ రాజేశ్వరరావు పాల్గొన్నారు