
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సీపీగా 16 నెలలు సక్సెస్ ఫుల్ గా పని చేసి రిలీవ్ అయిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అభిషేక్ మహంతికి పోలీసాఫీసర్లు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. శనివారం రాత్రి కమిషనరేట్ ఆఫీసులోని ఆడిటోరియంలో నిర్వహించిన సభలో గజమాలతో సత్కరించారు.
16 నెలల్లో ఆయన చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేస్తూ కొనియాడారు. అంతకు ముందు మధ్యాహ్నం ఆడిటోరియంలో గబ్బర్ సింగ్ పాటకు డ్యాన్స్ లు చేస్తూ కొందరు సీఐలు, ఎస్సైలు సీపీ అభిషేక్ మహంతిని ఎత్తుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.