ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్త : కర్నాటక సీఎం

ఆరోపణలు నిరూపిస్తే  రాజకీయాలు వదిలేస్త : కర్నాటక సీఎం
  • మోదీకి కర్నాటక సీఎం సవాల్

హవేరి (కర్నాటక): ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఖర్చుల కోసం కాంగ్రెస్ పార్టీ కర్నాటక నుంచి రూ.700 కోట్లు అందించిందని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ప్రధాని ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా నని సవాల్ చేశారు. నిరూపించలేకపోతే మోదీ తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం హవేరి జిల్లా షిగ్గాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు.ప్రధాని మోదీ ఈ  స్థాయిలో అబద్ధాలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయా. 

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఖర్చులకు కర్నాటకలోని కాంగ్రెస్ సర్కారు ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.700 కోట్లు వసూలు చేసిందని ఆదివారం ఆయన ఆరోపించారు. ఇది నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. నిరూపించలేకపోతే ఆయన తప్పుకోవాలి. ప్రధాని మాటలు నిజానికి దగ్గరగా ఉండాలి. కానీ, మోదీవి మాత్రం చాలా దూరంగా ఉంటున్నయి. స్వతంత్ర భారతదేశంలో ఈ స్థాయిలో అబద్ధాలు చెప్పే ప్రధానిని దేశం ఎన్నడూ చూడలేదు” అని సిద్ధరామయ్య అన్నారు.