బూర్గంపహాడ్,వెలుగు: ఆంధ్ర నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణలోకి ప్రవేశించిన 15 ఇసుక లారీలను మంగళవారం రాత్రి మైనింగ్, పోలీస్ అధికారులు సీజ్ చేశారు. ఆంధ్రాలోని గుండాల ఇసుక ర్యాంపు నుంచి మంగళవారం అర్ధరాత్రి వచ్చిన లారీలను బుర్గంపహాడ్ మండలంలోని సారపాక, మణుగూరు క్రాస్ రోడ్డు వద్ద నిలిపారు. విషయం తెలిసి జిల్లా మైనింగ్ అధికారులు తనిఖీ చేయగా అనుమతి పత్రాలు లేకుండా తెలంగాణలోకి ప్రవేశించినట్లు గుర్తించారు.
బూర్గంపహాడ్ పోలీసుల సహాయంతో 2ఇసుక లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 13లారీల డ్రైవర్ల పారిపోగా వాటిని అక్కడే ఉంచారు. కొన్ని రోజులుగా ఏపీ నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్, ఖమ్మంకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.