మావోయిస్టు వారోత్సవాలు.. ఏజెన్సీ ఏరియాలో పోలీసుల హై అలర్ట్

మావోయిస్టు వారోత్సవాలు.. ఏజెన్సీ ఏరియాలో పోలీసుల హై అలర్ట్

ములుగు: మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ఏరియాలో  పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామ శివారులో ఇవాళ (సెప్టెంబర్ 23) ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తుల వద్ద వివరాలు తీసుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్‎తో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధాన రహదారికి ఇరువైపుల బ్రిడ్జిలను డాగ్ స్క్వాడ్ బృందాలతో సోదాలు చేపట్టారు. మావోయిస్టుల వారోత్సవాలతో పాటు ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలో ఇటీవల పెద్ద ఎత్తున ఎన్ కౌంటర్లు జరగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

ALSO READ | హైదరాబాద్లో లేడీ డాన్‌ అరెస్ట్.. ఇలాంటి పనులు చేస్తే చివరకు ఇదే గతి..