షేక్ హసీనా ఎఫెక్ట్.. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌లో పోలీసులు హై అలర్ట్

షేక్ హసీనా ఎఫెక్ట్.. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌లో పోలీసులు హై అలర్ట్

ఢాకా: తాను స్వదేశానికి తిరిగొస్తానని షేక్ హసీనా ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పోలీసులను అలర్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. షేక్ హసీనా రాకతో అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు రాజధాని ఢాకాకు పెద్ద ఎత్తున చేరే అవకాశం ఉందని..తద్వారా అల్లర్లు జరగవచ్చని ఉత్తర్వులో వెల్లడించింది. ప్రతి రాష్ట్రం నుంచి సుమారు 200- నుంచి 250 మంది సపోర్టర్లు ఢాకాకు చేరవచ్చని.. అందువల్ల భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించింది. తమ పరిధిలో నిఘా పెంచాలని పోలీస్ స్టేషన్ల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌లకు సూచించింది. ఎవరైనా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే  వెంటనే అడ్డుకోవాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లపై ఫోకస్ పెట్టాలని తెలిపింది.