సరాతంతో వాతలు... పంట మేసిన పశువులను కొట్టాడని ఆరోపణతో పోలీసుల దాష్టీకం!

సరాతంతో వాతలు... పంట మేసిన పశువులను కొట్టాడని ఆరోపణతో పోలీసుల దాష్టీకం!

దహేగాం: ఆసిఫాబాద్‌ జిల్లా దహేగాం మండలం ఐనం గ్రామానికి చెందిన రైతుపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. పంట మేసిన పశువులను కొట్టాడని సరాతంతో వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేశారు.బాపురావు అనే  రైతుల చేనులోకి ఇతరులు పశువులు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన రైతు వాటిని కొట్టాడు.  దీనిపై పశువుల యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో ఎస్సై బాపురావుని పోలీసు స్టేషనుకు పిలిపించి తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టారు. 

స్పృహ తప్పిపడి ఉన్న అతన్ని మంచిర్యాల హాస్పిటల్ కు తరలించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే దీనిపై స్థానిక ఎస్సై మాత్రం తాను అలాంటివాడిని కాదని, తాను కొట్టలేదని చెప్పడం గమనార్హం.