
కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లు, అంత్యక్రియల కోసం స్థానిక పోలీసుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. వివాహానికి అత్యధికంగా 50 మంది, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతి ఇస్తామని.. ఫంక్షన్ హాళ్లు, కళ్యాణ మండపాల్లోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఒడిశా ప్రభుత్వం తెలిపింది.