
- ఒక్క పరుగు తేడాతో పోలీస్ జట్టు విజయం
కోల్ బెల్ట్, వెలుగు: యాంటీ డ్రగ్స్అవేర్నెస్లో భాగంగా మందమర్రి పట్టణం సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. 14 ఓవర్ల మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్చేసిన పోలీసుల జట్టు 111 రన్స్ చేసింది. కెప్టెన్ ఎస్సై రాజశేఖర్ 32, కానిస్టేబుల్రాకేశ్ 27 రన్స్చేశారు. ప్రెస్ క్లబ్‌కు చెందిన కడారి శ్రీధర్ మూడు వికెట్లు తీశాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రెస్ క్లబ్ జట్టు క్రీడాకారులు దూకుడుగా ఆడారు. అనిల్ 31, సతీశ్ 33 రన్స్ సాధించారు. కానీ నిర్దేశిత 14 ఓవర్లలో 110 రన్స్ మాత్రమే చేసి ఒక పరుగు తేడాతో ఓటమి పాలయ్యారు. ఎస్సై రాజశేఖర్4 వికెట్లు తీశారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఎస్సైకి మ్యాన్ఆఫ్ ది మ్యాచ్అవార్డు దక్కింది.
విజేతలకు బెల్లంపల్లి ఎసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి ట్రోఫీ అందజేశారు. ఏసీపీ మాట్లాడుతూ.. నేరాల నుంచి యువతను దూరంగా ఉంచేందుకు క్రీడలు మంచి మార్గమన్నారు. డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు అంతా కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.