సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు.. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, ఎస్సైకి గాయాలు

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు.. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, ఎస్సైకి గాయాలు
  • మంటలంటుకోవడంతో ప్రమాదం   

మెదక్ టౌన్, వెలుగు:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి  దీక్ష భగ్నం, అరెస్ట్​ను నిరసిస్తూ గురువారం మెదక్ రాందాస్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్​కు మంటలంటుకున్నాయి. ఆయన చెంపకు, ఎడమ చేతికి గాయాలయ్యాయి. 

దీంతో ఆయనను స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అలాగే ఈ ఘటనలో మెదక్​ టౌన్​ ఎస్సై పోచయ్య తల కుడి భాగం వైపు గాయాలయ్యాయి. దీంతో అతడిని మెదక్​లోని దవాఖానకు తరలించారు. పోలీసుల తీరును బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేవైఎమ్​ జిల్లా కార్యదర్శి సతీశ్​ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులపై పోలీసులు అత్యుత్సాహం చూపారని మండిపడ్డారు.