
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను హనుమకొండ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. కోర్టు వెనుక గేటు నుంచి సంజయ్ ను లోపలికి తీసుకెళ్లారు పోలీసులు దీంతో అక్కడ హై టెన్షన్ నెలకొంది. ఏప్రిల్ 05 మంగళవారం అర్థరాత్రి సమయంలో సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కొద్దిసేపటి క్రితమే కోర్టు ముందు హాజరుపరిచారు. బీజేపీ కార్యకర్తలు కోర్టు దగ్గరికి భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు దగ్గర భారీగా పోలీసులు కూడా మోహరించారు. వరుసగా కాన్వాయ్ లు మారుస్తూ సంజయ్ ను తిప్పుతున్న పోలీసులు సాయంత్రం నాలుగు గంటల సమయంలో కోర్టు ముందు హాజరుపరిచారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అరెస్టు, పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టులో పిటీషన్ వేసింది బీజేపీ లీగల్ సెల్. ఎంపీగా బండి సంజయ్ ను అర్థరాత్రి బలవంతంగా, అక్రమంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లటాన్ని సవాల్ చేస్తూ ఈ పిటీషన్ వేసింది పార్టీ లీగల్. ఏప్రిల్ 5వ తేదీన.. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తదుపరి ప్రక్రియను మాత్రం ఏప్రిల్ 6వ తేదీ గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు.