మధిర, వెలుగు : పేకాటస్థావరంపై మధిర పోలీసులు ఆదివారం దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఇల్లూరు గ్రామ శివారు సుబాబుల్ తోటలో కొందరు పేకాట ఆడుతున్నట్లు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మధిర టౌన్ ఎస్ఐ సంధ్య ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, నలుగురు పారిపోయారు.
నిందితుల నుంచి రూ.6,330 నగదు, 10 మొబైల్ ఫోన్లు, 5 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.