జూలూరుపాడు, వెలుగు : మండల పరిధిలోని వెంగన్నపాలెంలో బెల్ట్షాపుపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. గన్నపాలెంలోని ఓ షాపులో అక్రమంగా నిల్వ ఉంచారు. పోలీసులు దాడి చేసి సుమారు రూ.20 వేల విలువైన మద్యం సీసాలను పట్టుకున్నారు.
ఈ మేరకు షాపు నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. తనిఖీల్లో ఎస్సై జీవన్ రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.