ఆంధ్రప్రదేశ్ : ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని హాజీపేటలో కోడి పందాలపై పోలీసులు దాడులు చేశారు. కోడి పందాలకు ఉపయోగిస్తున్న 370 కత్తులను మాగిశెట్టి రామకృష్ణ అనే వ్యక్తి వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ టీ.కే రాణా ఆదేశాల ప్రకారం.. కోడి పందాల నిర్వాహకులపై పోలీసులు దాడులు చేశారు.
మైలవరం డివిజన్ లో కోడి పందాలు, పేకాట ఆడే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. జూదల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. జూదల వైపు ప్రజల దృష్టిని మళ్లీంచేందుకు స్థానిక ప్రజా పతినిధులతో కలిసి గ్రామాల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. కోడిపందాలు, పేకాట ఆడేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.