బెల్ట్ షాప్ లపై దాడులు

హుజూర్ నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం గోపాలాపురం గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాప్ లపై  పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఎస్సై జి. ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామంలో నూకన సత్యనారాయణ, నూకన పిచ్చమ్మ కిరాణం షాపులో  మద్యం  విక్రయిస్తున్నారనే పక్కా  సమాచారంతో  దాడుల చేశారు.  

రూ.10 వేల విలువైన  మద్యం బాటిళ్లను సీజ్ చేసి కేసు నమోదు  చేసినట్టు ఎస్సై  ముత్తయ్య తెలిపారు.    గోపాలపురం సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు  చిల్లెపల్లి  నుంచి హుజూర్ నగర్ కు  అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్  ను పట్టుకున్నట్టు ఎస్సై తెలిపారు.