
హైదరాబాద్: గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమ స్పా సెంటర్ లపై పోలీసులు దాడి చేశారు. ఓ అపార్ట్మెంట్ లో జన్నత్ మరియు గోల్డెన్ అనే రెండు స్పా సెంటర్ల పై దాడి చేసి క్రాస్ మసాజ్ చేస్తున్న ఐదుగురు అమ్మాయిలతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి స్పా సెంటర్లు ఎక్కడ ఉన్నా ఆ భవన యజమాని వారిని ఖాళీ చేయించాలని, లేని పక్షంలో వారి పైనా చర్యలు తీసుకుంటామని గుడిమల్కాపుర్ ఇన్స్పెక్టర్ ముజీబ్ రెహ్మాన్ హెచ్చరించారు..