తలుపులు మూసేసి రాత్రంతా దందా.. పాతబస్తీలో పోలీసుల ఆకస్మిక దాడులు

తలుపులు మూసేసి రాత్రంతా దందా.. పాతబస్తీలో పోలీసుల ఆకస్మిక దాడులు

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. పాతబస్తీలోనీ పలు హోటల్స్‌లో తనిఖీలు నిర్వహించారు. పాతబస్తీ పరిధిలో అర్ధరాత్రి కూడా హోటల్స్‌లో నడిపిస్తున్నట్లు సమాచారం అందటంతో బార్కాస్‌ నుంచి పహాడిషరీఫ్‌ వరకు పోలీసుల ఆకస్మిక సోదాలు చేశారు. పలు హోటల్స్ నిర్వాహకులు తలుపులు మూసేసి నిబంధనలకు విరుద్ధంగా రాత్రంతా హోటల్స్‌ నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి కూడా హోటల్స్‌లో ఫుడ్‌ సరఫరా చేస్తుండటంతో పోలీసుల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీంతో హోటల్స్‌ నిర్వాహకులతో పాటు కస్టమర్లకు పోలీసుల కౌన్సిలింగ్‌ ఇచ్చారు. రాత్రి పూట హోటల్స్‌ నడిపిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హోటల్ నిర్వాహకులు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుడ్ కల్తీ ఘటనలు, నిబంధనలు విరుద్ధంగా హోటల్స్, రెస్టారెంట్లు నడుపుతోన్న వారిపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే డైలీ హైదరాబాద్‎లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.