శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అడ్డాగా చేసుకుని.. శ్రీశైలం ఆలయం సమీపంలోని అడవుల్లో పేకాట డెన్స్ ఏర్పాటు చేశారు కొందరు వ్యక్తులు. శ్రీశైలం శివయ్య క్షేత్రం పరిధిలోని గణేష్ సదన్ వెనక ఉన్న నిర్మానుష్యమైన అటవీ ప్రాంతంలో 20 మంది గ్రూపులుగా పేకాట ఆడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. పక్కాగా దాడులు చేశారు. పేకాట శిబిరాలను చుట్టుముట్టి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ పేకాటరాయుళ్ల నుంచి 8 బైక్స్, లక్షా 21 వేల 190 రూపాయల నగదు, ఓ ఆటో స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా ఈ అటవీ ప్రాంతాన్ని అడ్డా చేసుకుని పేకాట జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నిఘా పెట్టిన పోలీసులు.. నిజం అని నిర్థారించుకుని దాడులు చేసి పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. శ్రీశైలం సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.
ఆలయం పరిసరాల్లో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సీఐ ప్రసాదరావు.