25 రోజుల్లో 591 సెల్​ఫోన్లు రికవరీ

మల్కాజిగిరి, వెలుగు : గత 25 రోజుల్లో రాచకొండ కమిషనరేట్​పరిధిలో చోరీకి గురైన, పోగొట్టుకున్న 591 సెల్​ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. సీపీ సుధీర్​బాబు గురువారం బాధితులకు అందజేశారు. 591 ఫోన్ల విలువ రూ.2 కోట్లు ఉంటుందని చెప్పారు. రాచకొండ ఐటీ సెల్​సహకారంతో ఎల్బీనగర్, భువనగిరి, మల్కాజిగిరి సీసీఎస్​పోలీసులు సీఈఐఆర్​పోర్టల్ ఆధారంగా 

మిస్సింగ్​ఫోన్లను ట్రేస్​చేశారని చెప్పారు. ఎల్​బీనగర్​పరిధిలో 339, భువనగిరి పరిధిలో 103, మల్కాజిగిరి పరిధిలో 149 సెల్​ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. రికవరీలో కీలకంగా వ్యవహరించిన ఎస్సైలు నరేందర్, సతీశ్వర్​రాజ్, హెడ్​కానిస్టేబుళ్లు మధుసూదన్​రెడ్డి, శ్రీనివాస్, కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు.