35 రోజుల్లో 800 సెల్​ఫోన్లు రికవరీ

35 రోజుల్లో 800 సెల్​ఫోన్లు రికవరీ
  • బాధితులకు అందజేసిన సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నర్సింహ

గచ్చిబౌలి, వెలుగు : సైబరాబాద్ కమిషనరేట్​పరిధిలో 35 రోజుల్లో మిస్సయిన, చోరీకి గురైన 800 సెల్​ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్​ కమిషనరేట్​ఆఫీసులో బాధితులకు ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్​క్రైమ్​డీసీపీ నర్సింహ మాట్లాడుతూ.. సైబరాబాద్ సీసీఎస్, ఐటీ సెల్, సోషల్ మీడియా టీమ్స్​సంయుక్తంగా కష్టపడి సీఈఐఆర్ పోర్టల్​ద్వారా 800 ఫోన్లను రికవరీ చేశాయన్నారు.

వీటి విలువ రూ. 2.40 కోట్లు ఉంటుందని చెప్పారు. ఎవరైనా తక్కువ రేటుకు కాస్ట్ లీ ఫోన్లు అమ్ముతామంటే కొనవద్దని డీసీపీ సూచించారు. కొట్టేసిన ఫోన్లతో సైబర్​నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారని, ఫోన్​పోతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సీసీఎస్​ఏసీపీలు కళింగరావు, శశాంక్​రెడ్డి, ఇన్​స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.