2 కోట్ల విలువైన 591 సెల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందించిన సీపీ

 హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్  పరిధిలో భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు పోలీసులు.  మొత్తం 591 ఫోన్లు రికవరీ చేశారు పోలీసులు. రాచకొండి సిటీ సెల్ ద్వారా మొబైల్స్ రికవరీ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. బాధితులకు మొబైల్ ఫోన్లు అందించారు సీపీ. 

రాచకొండ పోలీస్ కమిషనరేట్  పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి గురైన  లేదా  పోగొట్టుకున్న  591 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సెప్టెంబర్ 5న  బాధితులకు ఫోన్లు అందజేసారు సీపీ సుధీర్ బాబు.  వీటి విలువ దాదాపు 2 కోట్లు ఉంటుందని వెల్లడించారు.    

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 339 ఫోన్లు, భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 103 ఫోన్లు, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 149 ఫోన్లు మొత్తం 591 ఫోన్లు స్వాదీనం చేసుకున్నామని చెప్పారు. ఫోన్లు పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  బాధితులు తమ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు  చేసి ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ఇస్తే త్వరగా రికవరీ సాధ్యమవుతుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు.