గోల్డ్ చైన్ పోగొట్టుకున్న విద్యార్ధి.. 2 గంటల్లోనే రికవర్ చేసిన పోలీసులు..

గోల్డ్ చైన్ పోగొట్టుకున్న విద్యార్ధి..  2 గంటల్లోనే రికవర్ చేసిన పోలీసులు..

బషీర్ బాగ్, వెలుగు: ఓ స్టూడెంట్​ పోగొట్టుకున్న గోల్డ్ చైన్​ను నారాయణగూడ పోలీసులు రెండు గంటల్లోనే వెతికిచ్చారు. బర్కత్​పురాలోని సదన్ అపార్ట్​మెంట్​లో ఉండే నవీన్ కుమార్ నారాయణగూడ జాహ్నవి కాలేజీలో చదువుతున్నాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి కాలేజీకి వెళ్లిన నవీన్ తన మెడలోని రెండు తులాల గోల్డ్ చైన్ పోగొట్టుకున్నాడు.

దీంతో బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కాలేజీ సమీపంలోనే గోల్డ్​చైన్ పడిందని గుర్తించి, వెతికిచ్చారు.