పెట్రోల్ పోసి నిప్పంటించి గుర్తు తెలియని మహిళను అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వికారాబాద్ మండల పరిధిలోని ఫుల్ మద్ది గ్రామ శివారులో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
జాగిలాలతో చుట్టుప్రక్కల ప్రాంతాలను సెర్చ్ చేశారు. మహిళపై కొంతమంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి... తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో మృతదేహాం గుర్తుపట్టలేకుండా ఉందని తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ హత్యా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.