కూతురుతో అసభ్య ప్రవర్తన .. తండ్రిపై పోక్సో కేసు

కూతురుతో అసభ్య ప్రవర్తన .. తండ్రిపై పోక్సో కేసు

కోల్ బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం యాపల్​కు చెందిన ఆకుదారి సతీశ్​ తన కూతురు(15) పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు బుధవారం పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్​కు పంపించారు. మందమర్రి టౌన్​ ఎస్సై రాజశేఖర్​ తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో డ్రైవర్​గా పనిచేసే సతీశ్  తరచూ తన​భార్యతో పెద్ద కూతురు తనకు పుట్టలేదంటూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో పోచమ్మ బోనాల పండుగ ఉందని చెప్పి మంగళవారం మధ్యాహ్నం హాస్టల్​లో చదువుకుంటున్న కూతురును ఇంటికి తీసుకువచ్చాడు. 

రాత్రి మద్యం మత్తులో కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకున్న భార్యను కర్రతో కొట్టాడు. భర్త అసభ్య ప్రవర్తనపై ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్​ చేసి  రిమాండ్​కు పంపారు. బాలికను కౌన్సిలింగ్  నిమిత్తం భరోసా సెంటర్ కు పంపించినట్లు ఎస్సై తెలిపారు.