సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జగన్ ను హత్య చేసేందుకే దాడి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. జగన్ పై దాడికి ముందస్తుగా ప్లాన్ చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. అదృష్టవశాత్తు సీఎం కు పెద్ద గాయం కాలేదని అన్నారు పోలీసులు. దాడి కోసం పదునైన రాళ్లను ప్యాంటు జేబులో వేసుకొని వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో A2గా ఉన్న మరో నిందితుడు దుర్గారావు A1 సతీష్ ను జగన్ ను హత్య చేసేందుకు ప్రేరేపించాడని రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 12మంది సాక్ష్యులను విచారించి వాంగ్మూలం రికార్డ్ చేశారు పోలీసులు. రిమాండ్ రిపోర్ట్ లో వెలుగులోకి వచ్చిన అంశాలు సంచలనంగా మారాయి. ఈ కేసులో A2గా ఉన్న దుర్గారావుకు టీడీపీతో సంబంధాలు ఉండటం దాని వెనుక టీడీపీ కుట్ర ఉందన్న వైసీపీ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి.