మాంసానికి డిమాండ్.. వీధి కుక్కల స్మగ్లింగ్

మాంసానికి డిమాండ్.. వీధి కుక్కల స్మగ్లింగ్

ఇప్పటివరకు మానవ అక్రమ రవాణా గురించి విన్నాం. తాజాగా కుక్కల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. జోర్ హట్ జిల్లాలో ముగ్గురు సభ్యుల ముఠా వీధి కుక్కలను ఎత్తుకెళ్లి.. అక్రమంగా నాగాలాండ్ కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి 24 కుక్కలను రెస్క్యూ చేశారు. నాగాలాండ్ లో ఈ ఏడాది జులై నుంచి కుక్క మాంసంపై నిషేధం విధించారు. అప్పటి నుంచి అక్రమరవాణా పెరిగిందన్నారు. న్యూ ఇయర్, క్రిస్టమస్ నేపథ్యంలో కుక్క మాంసానికి డిమాండ్ పెరగడంతో.. వీధి కుక్కలను ఎత్తుకెళ్తున్నారని స్థానిక ఎన్జీవోలు చెబుతున్నారు.

For More News..

 మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థిని సూసైడ్