కరీంనగర్లో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను పోలీసులు కాపాడారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ శివారులోని కృష్ణా నగర్ కు చెందిన దామల్ల ప్రత్యూష(30) అనే వివాహిత ఇంట్లోని బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. సకాలంలో ఘటనాస్థలానికి చేరుకుని ప్రత్యూష మృతదేహాన్ని బావిలోంచి బయటికి తీశారు.
భర్తతో ఉన్న గొడవలతో సహనం కోల్పోయిన ప్రత్యూష బలవంతంగా ప్రాణాలు తీసుకునేందుకు ఇంట్లో ఉన్న బావిలో దూకింది. చివరి నిమిషంలో మనసు మార్చుకున్నర ప్రత్యూష.. బావి లోపలి అంచు పట్టుకొని మునిగిపోకుండా ఆగిపోయింది. తాళ్ల సాయంలో ఆమెను పోలీసులు, ఫైర్ సిబ్బంది బయటికి తీశారు.
గతం కొంత కాలంగా తన భర్తతో గొడవలు జరుగుతున్నాయి.. భరించలేక ఆత్మహత్యాయత్నం చేశానని ప్రత్యూష పోలీసులకు తెలిపింది. బాధితురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి.. చనిపోవడం పరిష్కారం కాదు.. అని ప్రత్యూషకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.