నో ఎంట్రీ.. అల్లర్లు చేస్తామంటే కుదరదు.. కంచ గచ్చిబౌలి భూమిలో పోలీసుల ఆంక్షలు

నో ఎంట్రీ.. అల్లర్లు చేస్తామంటే కుదరదు..  కంచ గచ్చిబౌలి భూమిలో పోలీసుల ఆంక్షలు

కంచ గచ్చిబౌలి వ్యవహారం జాతీయస్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే.ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో కంచ గచ్చిబౌలి అటవీ నిర్ములనలో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు... అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా భారీ నిరసనల నేపథ్యంలో శుక్రవారం ( ఏప్రిల్ 4 ) నుండి అమలులోకి వచ్చేలా కదలికలపై ఆంక్షలు విధించారు హైదరాబాద్ పోలీసులు.

హెచ్ సీయుకు ఆనుకొని ఉన్న కంచ గచ్చిబౌలి లో ఉన్న  400 ఎకరాల భూమి పై  తెలంగాణ హైకోర్టు , సుప్రీం కోర్టు ఆంక్షలున్న క్రమంలో నిషేధిత ప్రాంతంలో ఎవరైనా ప్రవేశించినా చట్టరీత్యా చర్యలు తప్పవని పేర్కొన్నారు పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా , అల్లర్లు  చేసినా , విధినిర్వహణకు భంగం కలిగించేలా వ్యవహరించినా చర్యలు తీసుకుంటామంటామని తెలిపారు పోలీసులు. 

►ALSO READ | ఇదేం ఇందిరమ్మ రాజ్యం.. ఇలా ఎంత మందిపై కేసులు పెడ్తరు.?: హరీశ్ రావు

కాగా.. కంచ గచ్చి బౌలి భూముల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం .ఈ భూమిలో  BNSS సెక్షన్ 163  ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని  తెలిపారు పోలీసులు.