హైదరాబాద్: భాగ్య నగర వాసులకు పోలీసు శాఖ ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ సిటీలో నెల రోజుల పాటు పోలీస్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందని, U/S 163 BNS యాక్ట్ ప్రకారం ఆంక్షలు విధిస్తున్నామని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.
— Hyderabad City Police (@hydcitypolice) October 27, 2024
సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నవంబర్ 28 వరకు.. నెల రోజుల పాటు ఆంక్షలు అమలవుతాయని పోలీస్ శాఖ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.