Chandrababu: చంద్రబాబు పర్యటనపై పోలీసుల ఆంక్షలు

Chandrababu: చంద్రబాబు పర్యటనపై పోలీసుల ఆంక్షలు

టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఆందోళన నెలకొంది. అనపర్తిలో చంద్రబాబు పర్యటనపై ఉన్నట్టుండి పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు ముందుగా నిర్ణయించుకున్నట్లు.. బలభద్రపురంలో రోడ్ నిర్వహించాలని ప్రయత్నించారు. దీంతో పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. బలభద్రపురంలో టీడీపీ కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీస్ కానిస్టేబుళ్లు రోడ్డు పై బైఠాయించి కాన్వాయ్‭ను ఆపివేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు ఇలా చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా కార్యకర్తలు బారీకేడ్లను తోసుకుని బలభద్రపురానికి భారీగా వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు కూడా భారీగా మోహరించడంతో అనపర్తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.