దీపావళి పండుగ, వీకెండ్ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రండ్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నవంబర్ 1నుంచి 3 వరకు డ్రంక్ ఎండ్ డ్రైవ్ లో 513 వాహనదారులు పట్టుపడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా.. వీకెండ్ కావడంతో రికార్డ్ స్థాయిలో మందు బాబులు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కారు. 425 టూ వీలర్స్, 24 త్రీ వీలర్స్, 60 ఫోర్ వీలర్స్, 4 హెవీ వాహనాల డ్రైవర్లు తాగి నడుపుతున్నట్లు గుర్తించారు.
Also Read :- యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి
మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైతే BNS సెక్షన్ 105 కింద కేసు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించే యోచనలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.