మా బండ్లలో డీజిల్ పోయిస్తే.. నీ బిడ్డను వెతుకుతం

  • కూతురు కిడ్నాప్ అయిందని కంప్లయింట్ ఇస్తే పోలీసుల సమాధానం
  • యూపీలో సంఘటన.. సోషల్ మీడియాలో బాధితురాలి వీడియో వైరల్

లక్నో: ఆమె ఒక దివ్యాంగురాలు. తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేయడంతో పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. బిడ్డను వెతికిపెట్టాలని పోలీసులను వేడు కుంది. కానీ వారు పట్టించుకోలేదు. పైగా ‘‘మా వెహికల్స్ లో డీజిల్ పోయిస్తేనే, నీ బిడ్డను వెతికిపెడతాం” అని సమాధానం ఇచ్చారు. తప్పని పరిస్థితుల్లో అప్పు తెచ్చి మరీ డీజిల్​కు డబ్బులు ఇచ్చింది. అయినా ఉపయోగం లేకపోవడంతో సోమవారం పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. తర్వాత జరిగిందంతా మీడియాకు చెప్పింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాకు చెందిన గుడియాకు మైనర్ కూతురు ఉంది. ఆమె భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. అయితే, పోయిన నెలలో ఆమె కూతురు కిడ్నాప్ అయింది. తమ బంధువే తన బిడ్డను కిడ్నాప్ చేశాడని, ఆమె లోకల్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నెల రోజులు ఆమెను స్టేషన్ చుట్టూ
తిప్పుకున్నారు.

అడిగితే తిట్టిన్రు…

‘‘నేను ఎప్పుడు వెళ్లి అడిగినా ‘మేం వెతుకుతున్నాం’ అని చెప్పేవారు. కొన్నిసార్లు ‘ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని తిట్టేవారు. నా బిడ్డపైనా నిందలు వేశారు” అని గుడియా ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి ‘‘మా వెహికల్స్ లో డీజిల్ పోయిస్తే, నీ బిడ్డను వెతికిపెడతాం” అని పోలీసులు చెప్పారని ఆమె పేర్కొంది. దీంతో బంధువుల దగ్గర అప్పుచేసి.. రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు డీజిల్ పోయించానని చెప్పారు. బతకడమే కష్టమైన తాను.. ఇంకెన్ని రోజులు డీజిల్ కు డబ్బులు ఇవ్వగలనని వాపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, లోకల్ పోలీస్​ ఆఫీసర్​ను సస్పెండ్ చేశారు. బాధితురాలి బిడ్డను వెతికేందుకు 4 స్పెషల్ టీమ్స్​ను ఏర్పాటు చేశారు.

For More News..

ఆరుసార్లు జాక్‌‌‌‌పాట్‌‌‌‌ కొట్టిన అదృష్టవంతుడు

లైసెన్స్‌‌‌‌‌‌‌‌ లేని వాళ్లకు బండిస్తే రూ. 5 వేలు ఫైన్

ఎలక్ట్రిక్‌‌ బైకులకు నో ట్యాక్స్‌‌, నో రిజిస్ట్రేషన్‌‌ ఫీజు

33 వేల మందికి ఒక్కడే డాక్టర్​.. ఇదీ మన ఆరోగ్యరంగం