బండి సంజయ్ కారులో పోలీసుల తనిఖీలు

చౌటుప్పల్ లోని పోలీసు చెక్ పోస్ట్  వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్ ను పోలీసులు తనిఖీ చేశారు. మునుగోడు బైపోల్ బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్  వివేక్ వెంకటస్వామి, సంజయ్ ప్రయాణిస్తున్న కారును ఆపి సోదాలు చేశారు. 

ఇక వచ్చే నెల 1తో ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో ప్రచార ఘట్టానికి గ్రాండ్ గా ముగింపు ఇచ్చేందుకు బీజేపీ రెడీ అయింది.  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ప్రచారానికి  మరింత ఊపు తీసుకురావాలని బీజేపీ భావిస్తుండగా.. ఆయన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. దీంతో ఆయనకు బదులు బీజేపీ చీఫ్  నడ్డాను టూర్​కు ఆహ్వానించారు. ఈ నెల 31 న మునుగోడులో ఏర్పాటు చేయనున్న ఉప ఎన్నిక ప్రచార సభకు ఆయన చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు. దీంతో ఆ సభను విజయవంతం చేయడంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఈ సభకు ఒకరోజు ముందే సీఎం కేసీఆర్ సభ ఉండడంతో టీఆర్ఎస్ సభ కన్నా బీజేపీ సభకు ఎక్కువ జనాన్ని తరలించి ప్రచారం పర్వంలో కూడా కాషాయ దళానిదే  పైచేయి అనే సంకేతాలను జనంలోకి తీసుకెళ్లే ఆలోచనతో బీజేపీ ఉంది.