వరంగల్ జిల్లా రాయపర్తిలోని స్టేట్ బ్యాంక్ దోపిడి వ్యవహరం కొలిక్కి రావటం లేదు. బ్యాంక్ లో దోపడికి పాల్పడిన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. ప్రత్యేక పోలీస్ బృంధాలను రంగంలోకి దింపారు. బ్యాంక్ లో లభ్యమైన అగ్గి పెట్టె, రక్తపు మరకల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయినా నిందుతులను గుర్తించలేక పోతున్నారు.
వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్ బీఐ లో దొంగలు చొరబడి 19 కిలోల బంగారం అపహరించుకు పోయిన సంగతి తెలిసిందే. దొంగలను పట్టుకునేందుకు వరంగల్ పోలీసులు 14 టీంలను రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారి పక్కనే ఉన్న బ్యాంకులో దొంగలు గ్యాస్ కట్టర్ , గ్యాస్ సిలిండర్లతో చొరబడి బంగారం ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
గ్రామం చివర బ్యాంకు ఉండడంతో దొంగలు ఈ బ్యాంకును ఎంచుకున్నట్లుగా భావిస్తున్నారు పోలీసులు. గ్యాస్ కట్టర్ తో బ్యాంకు కిటికీ ఊచలు తొలగించి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. ముందస్తు ప్లాన్ తో సీసీ కెమెరాల కనెక్షన్లు, సెక్యూరిటీ అలారం కనెక్షన్లు తొలగించినట్లు పోలీసులు చెబుతున్నారు. మూడు లాకర్లలో బంగారం నిలువ చేసి ఉండగా, ఒక లాకర్ ను ఓపెన్ చేసి అందులో ఉన్న 19 కిలోల బంగారం ఎత్తుకెళ్లారని పోలీసులు, బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. సీసీ పుటేజీ లేకపోవటంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది.
ఇన్ని రోజులు కావొస్తున్న దోపిడికి పాల్పడిన వారి ఆచూకిని పోలీసులు కనుగొన లేకపోయారు. లాకర్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసే క్రమంలో గాయపడిన దొంగ ఎక్కడ చికిత్స తీసుకుంటున్నాడు... మెడికల్ షాపుల్లో మందులు కొన్నాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీసినా.... ఆనవాలు లభించకపోవటంతో దొంగలను పట్టుకోవటం సవాల్ గా మారింది.
కర్ణాటక భ్యాంక్ లో చోరీకి పాల్పడిన ముఠానే రాయపర్తి బ్యాంక్ ను అపహరించుకుని పోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకులో వదిలి వెళ్లిన ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ ను అమెజాన్ ద్వారా ఆన్ లైన్ లో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అది రాజమండ్రిలో ఉన్న చిరునామాకు డెలివరీ అయినట్లు తేలడంతో అక్కడికి ప్రత్యేక పోలీస్ బృందం వెళ్లి గాలిస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రైవేటు బ్యాంకులో పెడితే రక్షణ ఉండదని ఎస్ బీఐ లో బంగారం తాకట్టు పెట్టామని బాధితులు అంటున్నారు. బ్యాంక్ అధికారులు బంగారం పై భరోసా ఇవ్వట్లేదని వాపోతున్నారు. తాకట్టు పెట్టిన బంగారం తిరిగి ఇవ్వడమో, నగదు చెల్లించడమో చేయాలని బాధితులు కోరుతున్నారు. పకడ్బందీగా బ్యాంకును దోచుకున్న దొంగలను పట్టుకునేందుకు పోలీసులు టీమ్ లుగా రంగంలోకి దిగారు. దొంగలను తొందరలో పట్టుకుంటారని... తమకు న్యాయం జరుగుతుందని బాధితులు ఎదురు చూస్తున్నారు.