
కోహెడ, వెలుగు: మండలంలోని బస్వాపూర్ దగ్గర శనివారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో ఎలాంటి ఆధారాలు లేని 25 తులాల బంగారాన్ని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నంగునూర్ మండలం అక్కెనపల్లికి చెందిన శ్రీహరి కరీంనగర్ నుంచి స్వగ్రామానికి కారులో వెళ్తుండగా రూ.16.25 లక్షల విలువ గల బంగారాన్ని గుర్తించి సీజ్ చేసినట్లు ఎస్ఐ తిరుపతి పేర్కొన్నారు.