123 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా రేషన్ బియ్యం కొని మహారాష్ట్రలో అమ్మేందుకు వ్యాన్​లో తరలిస్తున్న 123 క్వింటాళ్లను కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం తెల్లవారుజామున కాగజ్ నగర్ నుంచి మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యాన్​ను స్థానిక మసాలా వాగు వద్ద పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి సయ్యద్ ఆరిఫ్, ఇషాక్ అహ్మద్ అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న బియ్యం విలువ రూ.4 లక్షలు ఉంటుందని, కాగజ్​నగర్ ఎంఎల్ఎస్ పాయింట్ లో అప్పగించి వ్యాన్​ను రూరల్ పీఎస్​కు తరలించినట్లు అధికారులుతెలిపారు.