
భద్రాద్రికొత్తగూడెం/అశ్వారావుపేట, వెలుగు :జిల్లాలోని పలు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఎస్పీ బి. రోహిత్ రాజు మంగళవారం పరిశీలించారు. జిల్లాలోని పెనగడప, మందలపల్లి, అల్లిపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లోని చెక్ పోస్టులను సందర్శించిన ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ. 3.53కోట్ల మేర స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లాలో 12 అంతర్రాష్ట్ర, నాలుగు అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. చెక్ పోస్టుల వద్ద మరింత పటిష్టంగా బందోబస్తు నిర్వహించాలన్నారు. ఆయన వెంట పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్తో పాటు సీఐలు, ఎస్సైలు ఉన్నారు.