నారాయణపేట, వెలుగు : వాహనాల తనిఖీల్లో11 క్వింటాళ్ల నల్లబెల్లాన్ని పోలీసులు పట్టుకున్నారు. సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో గుర్మిత్కల్ నుంచి మహబూబ్నగర్ వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో నల్లబెల్లం ఉన్నట్టు గుర్తించారు.
వాహనంలోని కిరణ్, రాజును అదుపులోకి తీసుకొని విచారించడంతో గుర్మిత్కల్లోని హనుమాన్ నాయక్ వద్ద బెల్లం కొనుగోలు చేసి మహబూబ్నగర్ తీసుకెళ్తున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,14,000 విలువైన 11 క్వింటాళ్ల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి బెల్లం అమ్మిన వ్యక్తి హనుమాన్ నాయక్, కిరణ్, రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.