- ఇద్దరు అరెస్ట్.. సూర్యాపేట జిల్లాలో ఘటన
సూర్యాపేట, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న 125 కిలోల గంజాయిని సూర్యాపేట జిల్లాలోని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.31.25 లక్షలు ఉంటుందని ఇన్ చార్జ్ ఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన ఎస్పీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
రామాపురం క్రాస్ రోడ్డు వద్ద కోదాడ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు రూ.31.25 లక్షల విలువచేసే 125 కిలోల గంజాయిని తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని ముంబైకు చెందిన డ్రైవర్ ఆసిఫ్ ఖాన్, చేపల వ్యాపారం చేసే మహమ్మద్ ఇమ్రాన్ ను అరెస్టు చేశారు. గంజాయితోపాటు ఒక కారు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.