
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న రూ.55 లక్షల విలువైన 220 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం ఎక్సైజ్డిప్యూటీ కమిషనర్ హరికిషన్వివరాలు వెల్లడించారు. పటాన్చెరు పీఎస్పరిధిలోని ముత్తంగి రింగ్రోడ్డ వద్ద గురువారం రాత్రి రూట్
వాచ్చేస్తుండగా మహారాష్ట్రకు చెందిన చంద్రకాంత్, విశాల్ దిలీప్, అమర్సంజయ్మహీంద్రా కారులో అనుమానాస్పదంగా కనిపించారు. దగ్గరికి వెళ్లే సరికి ఇద్దరు పారిపోగా చంద్రకాంత్ ను పట్టుకున్నామని చెప్పారు. అతడి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకొని కారును సీజ్ చేసినట్లు తెలిపారు.