మహబూబాబాద్ జిల్లాలో..30క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత

నర్సింహులపేట, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలో 30క్వింటాళ్ల నల్ల బెల్లాన్ని పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని జయపురం, రామన్నగూడెం క్రాస్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గూడ్స్ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో తనిఖీ చేయగా 60బస్తాలలో 30క్వింటాళ్ల నల్లబెల్లం 2క్వింటాళ్ల పటిక గుర్తించారు.

వాహనంతో పాటు మండలంలోని దాసు తండాకు చెందిన గుగులోతు వీరన్న,గుగులోతు హేమ,గుగులోతు శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు.వీరు ఏపీలోని చిత్తూరు నుండి బెల్లం రవాణా చేసి పరిసర తండాల్లో విక్రయాలు చేస్తున్నట్లు తెలిపారు.పట్టుబడిన బెల్లం విలువ 3లక్షల20వేలు ఉంటుందని ఎస్సై సతీశ్ చెప్పారు. తనిఖీల్లో పీసీలు రమేశ్, రవి,విజయ్,యకయ్య పాల్గొన్నారు.