మైనర్లకు వాహనాలు ఇవ్వొదు : సీఐ నరేందర్

  • స్పెషల్ డ్రైవ్​లో 35 వాహనాలు సీజ్

లక్సెట్టిపేట, వెలుగు: మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని లక్సెట్టిపేట సీఐ నరేందర్ తల్లిదండ్రులకు సూచించారు. బుధవారం సాయంత్రం పోలీసులు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశారు. నంబర్ ప్లేట్లు లేని 35 బైక్​లను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు నడపరాదని, సైలెన్సర్లు మార్చి సౌండ్ పొల్యూషన్​కు పాల్పడొద్దన్నారు. ర్యాష్ ​డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్​ఐ చంద్రకుమార్, అడిషనల్ ఎస్​ఐ తానాజీ, సిబ్బంది పాల్గొన్నారు.