పల్లారుగూడలో రేషన్ బియ్యం పట్టివేత

పర్వతగిరి(సంగెం), వెలుగు  : వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారుగూడలోని  శ్రీ మహాలక్ష్మీ బిన్నీ రైస్ మిల్ లో అక్రమంగా  నిల్వచేసిన   సుమారు 400 బస్తాల రేషన్ బియ్యాన్ని  పోలీసులు పట్టుకున్నారు.  బుధవారం  పర్వతగిరి సీఐ శ్రీనివాస్​ తెలిపిన వివరాల ప్రకారం... మిల్లు యజమాని కలకొండ ఏకాంబరాచారి గతంలో ప్రభుత్వం నుంచి వడ్లు తీసుకున్నా.. సీఎంఆర్​కు అప్పగించలేదు.  

జిల్లా సివిల్​ సప్లయ్​ అధికారులు తనిఖీల కోసం మిల్లుకు వెళ్లారు. ఈ క్రమంలో  పీడీఎస్​ బియ్యం తరలించడానికి సిద్దంగా ఉంది. గమనించిన అధికారులు తనిఖీ చేసి,  పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.  దీంతో  యజమాని ఏకాంబరాచారి పై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరేశ్​, సిబ్బంది ఉన్నారు.