వనపర్తి, వెలుగు : కొత్తకోట మండలం రాయినిపేట గ్రామంలో ఒకరి ఇంట్లో దాచిన 41క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై మంజునాథ్‌రెడ్డి తెలిపారు. గ్రామంలోని నక్కకుమార్ ఇంట్లో 72 సంచుల్లో 41 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచాడు. సమాచారం అందుకున్న పోలీసులు , సివిల్ సప్లయ్ ఎన్ఫోర్సుమెంటు అధికారులు ఆయన ఇంటిపై దాడిచేసి, నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని గుర్తించారు.
తాను రేషను బియ్యాన్ని ఇంటింటికి తిరిగి కిలో రూ.10చొప్పున కొనుగోలు చేసి కర్ణాటక లోని రాయిచూర్‌లో తెలిసిన వారికి కిలో రూ.18కి అమ్మతున్నట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.