
మణుగూరు, వెలుగు: ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 64 కేజీల గంజాయిని పట్టుకున్నట్టు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కరంచంద్ తెలిపారు. కేరళకు చెందిన మహమ్మద్ జమీర్ ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ నుంచి బెంగళూరుకు గంజాయిని కారులో తరలిస్తూ బుధవారం మణుగూరులో పోలీసులకు పట్టుబడినట్లు చెప్పారు.
అతడి నుంచి రూ.19. 10 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్లు పేర్కొన్నారు.