800 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న పోలీసులు

800 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న పోలీసులు

మేడ్చల్ జిల్లా : నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని 800 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నా సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శామీర్ పేట్ పోలీసు స్టేషన్ లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు.. విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా బెల్లంపల్లికి ప్రభుత్వ నిషిద్ధ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ ఏస్వోటీ, శామీర్ పేట్ పోలీసులు ఆరెంజ్ బౌల్ రిసార్ట్ వద్ద పక్క నిఘా పెట్టి మరీ ఐశ్చర్ వాహనాన్ని తనిఖీ చేశారు. 100 కూరగాయల సంచులు వాటి మధ్య 40 సంచుల్లో 800 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. వాహనం నడుపుతున్న నల్ల మల్లేష్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. 

గుండ రాజు ఆదేశాల మేరకు విజయవాడలో విత్తనాలను పంపిణీ చేసిన వ్యక్తులు పరారీలో ఉన్నారని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మిన, సరఫరా చేస్తున్న పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ తెలిపారు. ఈ సంఘటన లో వ్యక్తిని అరెస్టు చేసి 800 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, ఫోన్, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్వోటీ డీసీపీ శ్రీనివాస్, అదనపు డీసీపీ శోభన్ కుమార్, పేట్ బషీరాబాద్ ఏసిపీ రాములు, శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్, ఎస్వోటీ పోలీసులను సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి అభినందించినట్లు డీసీపీ తెలిపారు.