ముస్త్యాల గ్రామంలో 29 టన్నుల బియ్యం పట్టివేత

ముస్త్యాల గ్రామంలో 29 టన్నుల బియ్యం పట్టివేత

చేర్యాల, వెలుగు: చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామ శివారులో ఉన్న రేణుక బిన్నీ రైస్ మిల్లు నుంచి అక్రమంగా తరలిస్తున్న 29 టన్నుల పీడీఎస్​ బియ్యం లారీని గురువారం పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యానికి సంబంధించిన వేబిల్లు సిద్దిపేట జిల్లా నంగునూర్​ మండలంలోని రాంపూర్​ శివారులో ఉన్న శ్రీనిధి రైస్​ మిల్లుదిగా చూపించారు. లారీని పీఎస్​తరలించి తహసీల్దార్​,  కలెక్టర్​కు సమాచారం అందించారు.

గతంలో ఈ మిల్లుపై  పీఏసీఎస్, ఐకేపీ వడ్ల కొనుగోలు విషయంలో ఆరోపణలు రావడంతో  ఈ మిల్లును  సీజ్​ చేశారు. తర్వాత పర్మిషన్​ వచ్చినప్పటికీ  అదే మిల్లు నుంచి పీడీఎస్​ అక్రమ రవాణా జరగడం చర్చనీయాంశంగా మారింది.