సిద్దిపేటలో ఇసుక వాహనాలు సీజ్

సిద్దిపేటలో  ఇసుక వాహనాలు సీజ్

సిద్దిపేట రూరల్, వెలుగు: ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు వాహనాలను పోలీసులు సీజ్​ చేశారు. శుక్రవారం సీఐలు రమేశ్, నరేశ్​ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట టూ టౌన్ పీఎస్​పరిధిలోని నర్సాపూర్ చౌరస్తా కుంకుమ మిల్లు వద్ద మూడు వాహనాలు,  చిన్న కోడూర్ పీఎస్​పరిధిలోని  రెండు లారీల్లో  ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం వచ్చింది.

సిబ్బందితో కలిసి వెళ్లి ఐదు వాహనాలు పట్టుకొని సీజ్​ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎవరైనా అక్రమంగా ఇసుక, పీడీఎస్​ బియ్యం తరలిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 తెలియజేయాలన్నారు.