- జగద్గిరిగుట్టలో గంజాయి చాక్లెట్స్ పట్టుకున్న పోలీసులు
జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్టలో ఓ మహిళ నిర్వహిస్తున్న కిరాణా దుకాణంపై బాలానగర్ ఎస్వోటీ, జగద్గిరిగుట్ట పోలీసులు దాడిచేసి 9.3 కిలోల గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు.
బిహార్‌కు చెందిన సునీతా దేవి(43) జగద్గిరిగుట్ట, శ్రీనివాస్నగర్లాస్ట్ బస్ స్టాప్‌లో ఆర్యన్ గోసామి పేరుతో కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. బిహార్‌లోని తన సొంత ఊరు నోవాన్ టౌన్ నుంచి ఒక్కో గంజాయి చాక్లెట్‌ను రూ.1కి కొని.. ట్రెయిన్లోఇక్కడికి తీసుకొచ్చి యువత, కార్మికులకు రూ.20 చొప్పున విక్రయిస్తోంది.
విశ్వసనీయ సమాచారం మేరకు ఆమె దుకాణంపై పోలీసులు దాడిచేసి గంజాయి చాక్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ చాక్లెట్స్‌ను ఉత్తరప్రదేశ్ లోని సద్గురు సాయి ఆయుర్వేద ఫార్మసీ కె.-16 , ఇండస్ట్రియల్ ఏరియా, రామ్‌నగర్, చాదౌలీలో తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జగద్గిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్ తెలిపారు.